మాడుగుల సంస్థాన చరిత్ర
**********************
#Madgula #ମାଡୁଗୁଲୁ
Thread
వైజాగపటం జిల్లాలోని అతి ప్రాచీన కొండ జమీందారీలలొ మాడుగుల ఒరియా జమీందారీ ఒకటి . ఇందులో 77 జిరాయితీ గ్రామములు , 26 అగ్రహారములు కలిసి సాలుసరి 30 వేలు కప్పము చెల్లించు అంగీకారమతో ఏర్పడింది .
1/n
ఈ సంస్థానమున సీలేరు నది మీదు కల మత్స్యగుండము అను తీర్థమందు చేపలను అతి పవిత్రమైనవని ప్రజలు భావించేవారు . ఇప్పటికీ అచారము కొనసాగుతున్నది . ఈ సంస్థానము పూర్వీకులు పాడేరు గ్రామములొ మొదటి సారిగా మకాం వేసినట్లు చరిత్ర ఉంది కావున ఈ సంస్థాన పాలకులు తమ పట్టాభిషేకోత్సవాలు తొలుత
2/n
లాంఛనంగా పాడేరు యందు నిర్వహించేవారు.మత్స్య ఆకారంలో కల శిలానిర్మితమైన ఒక సింహాసనం ఇప్పటికీ ఉంది . వీరి ధ్వజములు , సంతకములు చేయడానికి ముందు మత్స్య ఆకృతి లిఖించడం ఆనవాయితీగా ఉండేది . ఈ సంస్థానములో చిన్నచిన్న ముఠాలు ఎక్కువగా ఉండి వారు ప్రజలనుండీ శిస్తులు వసూళ్లు చేసి తమ వాటా
3/n
పోగా మిగిలింది జమీందారు నకు చెల్లించేవారు . ఈ సంస్థాన పాలకులు పాండవుల సమీప బంధువులగు మత్స్యదేశప్రభువుల సంతతి వారట .. కానీ స్పష్టతలేదు . అయితే వీరు మత్స్యకార ధ్వజములు , గద్దెలు , సంతకములు చేయునపుడు మత్స్యకృతిని లిఖించుట ,
4/n
మత్స్యకుండమునందు కల చేపలను పవిత్రమైనవిగా భావించుట మరియు వీరు మత్స్యకులము వారగుట వలన లక్షణములు కనిపిస్తున్నాయి . వీరు జయపుర సంస్థానము వారి కూటస్థుని సన్నిహితబంధువులని ఉత్తరదేశమునుండి ఇచ్చటకు వలసలు వచ్చినవారని , వారి ప్రతినిధిగా మాడుగుల సీమకు పాలకుడుగా వీరి పూర్వులగు
4/n
ఒకరికి భూపతి అని బిరుదుతొ నియమించినట్లు ఇంకొక కధనము ఉంది. వీరు జయపురము వారి సమీప జ్ఞాతులనుట సంభంధభాందవ్యముల వలన సంశయము లేదు.వీరి పూర్వలు జయపుర రాజులకు నెమలిపింఛము పట్టేవారు.వీరి మూలపురుషుడు చోళభూపతిదేవు (721-771)కీశ (771-1700)వరకూ ఇరువదిఒక్కరు ఈ మాడుగుల సంస్థానము పాలించారు.
5/n
విజయనగర పాలకులపై తిరుగుబాటు చేసిన కొండజమీందారులతొ చేరి బ్రిటిష్ వారి సేనలపై తలపడినందున నాటి మాడుగుల జమీందారు లింగభూపతిని అధికారము నుండి తొలగించాలని పూసపాటి సీతారామరాజు ప్రయత్నాలు మొదలు పెట్టారు . ఒకవేళ సీతారామరాజు తమపై దండెత్తిన సహయసహకారములకు అనకాపల్లి జమీందారు
6/n
పాయకరాయునితొ ఒడంబడిక చేసుకున్నారు . కానీ రణనీతి నిపుణులు సీతారామరాజు ముందుగానే గ్రహించి వీరి ఒడంబడిక సాగనీయక తన సేనాని యగు సాగి నారాయణరాజు సైన్యముతో పంపి లింగభూపతిని మాడుగుల నుండి పారదోలారు . మాడుగుల జమీందారీ వశపరచుకొని అక్కడ విజయనగర ఠాణా ఏర్పాటు చేసి అధికారులను నియమించారు .
7/n
లింగభూపతి గోదావరి మన్యములకు వలసపోయి అక్కడనే మరణించారు . 1794 వ సంవత్సరములొ పద్మనాభ యుద్ధమున విజయనగర మహారాజు విజయరామరాజు వీరోచిత యుద్ధంలో వీరమరణం పొందిన తదుపరి విజయనగర రాచరికచరిత్ర ముగిసింది అంతవరకూ మాడుగుల సంస్థాన లింగభూపతిని వంశీయులు జయపురము నందే దీర్ఘకాల ప్రవాసము చేశారు .
8/n
తదుపరి వైజాగపటం జిల్లా కలెక్టర్ గారు జయపురము నుండి వీరి కుటుంబమును రప్పించి లింగభూపతిని సోదరుడు కుమారులలొ జ్యేష్ఠుడగు కృష్ణభూపతి తనయుడు జగన్నాథభూపతిని సాధారణ షరతులతో మాడుగుల సంస్థానమును కౌలునకు ఇచ్చారు . కానీ చిరకాలంగా సాగిన యుద్ధ విప్లవాలమూలంగా జమీందారీ చాలా వరకూ అప్పుల్లో
8/n
మునిగి కష్టాల్లో పడ్డారు . ఉన్న ప్రజలు కష్టతరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు . పనిలేదు, పంటలేదు సంపద లేక తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది.సంస్థానము ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా లింగభూపతి పినతండ్రికి ఒక ఉంపుడుగత్తెవలన పుట్టిన కుమారుడు అప్పలభూపతి సంస్థాన హక్కులు తనదంటూ సవాలు చేయుటవలన
9/n
వివాదము లేవదీశారు.కానీ ఆయన వాదము ప్రమాణబద్ధము , శాస్త్ర సంశుద్ధము కానందున నిరాకరించారు . అయినప్పటికీ తన పట్టునువీడక తన పక్షమును బలపరచుకొనే ప్రయత్నం చేస్తూ ప్రజలనుండి శిస్తులు వసూళ్లు చేయడం జరిగింది . ఇలా ఇంటిపోరు 15 సంవత్సరాలు సాగింది . అప్పలభూపతి మరణానంతరం వైజాగపటం
10/n
కలెక్టర్ అలెగ్జాండర్ గారు జగన్నాథభూపతితో జమీందారీ వ్యవహారం శాశ్వతంగా పరిష్కరించబడింది . మాడుగుల సంస్థానాధీశులు జగన్నాథభూపతి అనంతరం ఆయన పుత్రుడు లింగభూపతి ( 1817-1831 ) సంస్థాన బాధ్యత చేపట్టారు . లింగభూపతి అనంతరం ఆయన పెద్ద భార్య రామయ్యకు 1831 లొ
11/n
జమీందారీ సంక్రమించినది ఎందుకనగా లింగభూపతికి పురుష సంతానము లేదు జోగిమణీదేవి అను పుత్రిక మాత్రమే ఉంది . ఈమె జయపురము సంస్థానము నందు కల్యాణసింగపురమను ఎస్టేటుదారులు శ్రీ ముకుందదేవు గారితో వివాహం జరిగింది . జగన్నాథభూపతికి లింగభూపతి కాక
12/n
హరిహరభూపతి , కృష్ణభూపతి అను ఇరువురు పుత్రులు కూడా ఉన్నారు . 1832 లొ రామయ్య ( లింగభూపతి భార్య ) నుండి సంస్థానము సంక్రమించినది . ఈయన కూడా సంతానము లేనందున తమ్ముడగు కృష్ణభూపతి ( 1813-1875 ) 1853 లో జమీందారు అయ్యారు . 1875 లొ కృష్ణభూపతి మరణానంతరం జమీందారీ ప్రభుత్వ పరమయినది .
12/n
కృష్ణభూపతికి గుణుపూరు రాజపుత్రికలు సోదరీమణులు అగు శ్రీ సీతాపట్టమహదేవి , శ్రీ నీలమణిపట్టమహదేవి ఇరువురు భార్యలు . సీతపట్టమహదేవి 1836 లొ జయపుర సంస్థానాధీశులు కృష్ణ చంద్రదేవు గారిని అడిగి వారి కుమారుడు శ్రీ విక్రమదేవవర్మ ( 1869-1951 ) ఏడు సంవత్సరాల ప్రాయమునందు దత్తత తీసుకున్నారు
13/n
ఈ దత్తత నీలమణిపట్టమహదేవికి ఎంతమాత్రము అంగీకరించక వ్యాజ్యాన్ని తెచ్చారు . సమస్త వివరములు సాక్షములను పరిశీలించి దత్తత చెల్లదంటూ కోర్టు తీర్పునిచ్చింది . కానీ తీర్పు రాకముందే నీలమణిపట్టమహదేవి మరణించారు . దత్తత చెల్లని కారణంగా విక్రమదేవవర్మ మాడుగులను వీడి తిరిగి
14/n
జయపురము నందు తల్లిదండ్రులు వద్దకు వెళ్ళిపోయారు . ( 1876 -1889 ) మధ్యలో సంస్థానము ప్రభుత్వ పాలనలో ఉంది . 1889 నుండి 1901 వరకూ సీతాపట్టమహదేవి గారే కౌన్సిల్ తీర్పుతో మాడుగుల జమీందారిణిగా పాలించారు . 4 మే 1901 లొ ఈమె మరణించారు . సీతాపట్టమహదేవి మరణానంతరం లింగభూపతిని రామయాంబ
15/n
దంపతుల పుత్రిక కల్యాణసింగపురము ఎప్డేటు దారు శ్రీ ముకుందదేవు గారి భార్యయగు జోగిమణీదేవి గారికి మాడుగుల జమీందారీ సంక్రమించినది . ఈమె కుమారుడు కృష్ణదేవు ఈయనకు కూడా సంతానము లేనందున ఆయన భార్య నీలాదేవి ముకుందదేవు అను అను బాలుని దత్తత చేసుకున్నారు . ఈయన మాడుగుల జమీందారీ వారసునిగా
16/n
గుర్తింపబడ్డారు . కృష్ణభూపతి ( 1853-1875 ) ద్వితీయ భార్యయగు నీలమణిపట్టమహదేవి గారికి అమ్మిమహదేవి యను పుత్రిక ఉంది ఈమెను జయపురము మహరాజు శ్రీరామచంద్రదేవుగారి తమ్ముడయిన విశ్వంభరదేవు గారి భార్య . అమ్మోమహదేవి 1895 లో మరణించారు . ఈమె కూతురు రాజేంద్రమణిదేవి కానీ నిస్సాంతాన వితంతువు
17/n
1901 లొ మాడుగులను పై ముకుందదేవు మరియు రాజేంద్రమణిదేవికి జమీందారీ పంపకము చేశారు . 1905 లొ ముకుందదేవు నిస్సాంతాన వంతునిగా మరణించుట వలన ఆయన భార్య చంద్రమణీమహదేవి గారికి వారి వంతు మాడుగుల జమీ వచ్చినది . 1931 వ సంవత్సరములొ మాడుగుల జమీందారీ పూర్తిగా
17/n
జయపురము సంస్థానములో విలీనమయినది . ఉత్కళ ( ఒరిస్సా ) రాష్ట్రావతరణముతో మద్రాసు రాష్ట్రమును శేషించి చివరకు ఆంధ్రరాష్ట్రములో అంతర్భాగమయింది అక్కడితో జమీందారీ చరిత్ర ముగిసింది.
18/n
You can follow @VAdkri.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.