అంతర్జాతీయంగా భారత్ విలువ పెరిగింది. అటు దౌత్యపరంగా,ఇటు సైనిక శక్తిగా ఆసియా లో చైనా కి ధీటుగా ఎదిగింది గత ఆరేళ్లలో. ఇప్పుడు భారత్ ముందు రెండు అత్యంత ప్రభావితమయిన ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.
1.అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఇటీవలే ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చాడు. NATO తరహాలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా,భారత్ లు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలి అని. నాటో లాగా అన్నమాట అంటే ఇది చాలా శక్తివంతమయిన ఆర్గనైజేషన్ అవుతుంది.
ఈ ప్రతిపాదన వచ్చింది అదీ అమెరికా నోటి వెంట అంటే ఇప్పటికే ఒక ముసాయిదా సిద్ధం చేసి వార్తని లీక్ చేశారనే అనుకోవాలి
2.జపాన్,ఆస్ట్రేలియా, అమెరికా లతో కలిపి ఒక పారిశ్రామిక సప్లై చైన్ ఏర్పాటు చేయాలి. ఇంతకీ ఈ ప్రతిపాదనల వల్ల భారత్ కి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ? ఒకసారి ఈ ప్రతిపాదనల బలాలు,బలహీనతలు ఏమిటో చూద్దాం.
1. నాటో తరహా కూటమి : భారత్,ఆస్ట్రేలియా,జపాన్, అమెరికా . అనుకూలతలు : Stability: స్థిరత్వం : NATO తరహా కూటమి అంటే సభ్య దేశాలలో ఎక్కడన్నా సరిహద్దుల్లో ఘర్షణ వస్తే అది సభ్యదేశాల మీద దాడి చేసినట్లు అన్నమాట [NATO ఆర్టికల్ 5 ప్రకారం ].
అంటే ఏదన్నా ఒక సభ్య దేశం మీద దాడికి ప్రయత్నిస్తే మిగతా సభ్యదేశాలు వెంటనే తమ సైన్యాన్ని అక్కడ మోహరిస్తాయి. ఉదాహరణకి : 4 సభ్యదేశాల కూటమిలో భారత దేశ LOC కానీ,LAC దగ్గర కానీ ఎలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడినా
వెంటనే అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా దేశాల మిలటరీ మన సైన్యానికి మద్దతుగా బరిలోకి దిగుతాయి. ఇది చైనాకి చెక్ పెట్టినట్లే
ఎందుకంటే సరిహద్దు వివాదం పేరుతో దానిని ఒక యాంటీ ఇండియన్ ఇన్స్తుమెంట్ గా వాడుకోవడానికి చైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. దీనివల్ల సరిహద్దుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది.
Quad గ్రూప్ ఏర్పడడం వల్ల పాకిస్తాన్ తన టెర్రరిస్ట్ కార్యకలాపాలకీ ఫుల్ స్టాప్ పెట్టాలి లేకపోతే 4 దేశాలనుండి అన్నీ తరహాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2. సహకారం : ఒక రకంగా చెప్పాలంటే నాలుగు దేశాల మధ్య సైనిక, మిలటరీ ఇంటెలిజెన్స్ , ఆయుధాలు వంటి వాటి మీద పరస్పర సహకారం ఉంటుంది అలాగే టెక్నాలజీ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కావాలంటే టెక్నాలజీ తీసుకోవచ్చు లేదా కొనవచ్చు.
ఇది భారత్ కి 'MAKE IN INDIA ' అనే నినాదానికి బూస్ట్ లాంటిది. ఆయుధాల ఎగుమతి దారుగా ఎదగడానికి మంచి అవకాశం. ముఖ్యంగా మిసైల్ టెక్నాలజీలో ఇప్పుడు భారత్ మెరుగయిన స్థాయిలో ఉంది
ఇంకా MTCR మెంబర్ కూడా [Military Technology Control Regime]. మన బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ ని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడే గత 5 ఏళ్లలో మన export లు 200% పెరిగాయి; దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు.
జపాన్ లిథియం పవర్ తో పనిచేసే మొదటి జలాంతర్గామి [Sub Marain] ని తయారు చేసింది సొ ! మనకి ఆ టెక్నాలజీ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చైనా తో ఏదన్నా సమస్య వస్తే మన నేవీ కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది
కనుక జపాన్ తన tech ని ఇవ్వడానికి అభ్యంతరం చెప్పదు. ఇది భారత అండర్ వాటర్ వార్ ఫేర్ ని మరింత బలంగా చేస్తుంది.
బ్లూ వాటర్ నేవీ [Blue water Navy]: భారత్ బ్లూ వాటర్ నేవీగా అవతరిస్తుంది Quad Group వల్ల. ఇప్పటికే చైనా తన నేవీ తో హిందూ మాహాసముదంలో చికాకు పెడుతున్నది. Quad Group లో ఉండడం వల్ల ఏదన్నా సమస్య వస్తే [Indian Ocean ] అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్ లు మన నేవీకి రక్షణగా ఉంటాయి.
ఇప్పటికే చైనా , రష్యా కలిసి న్యూక్లెయర్ జలాంతర్గాముల అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఇది మనకి నష్టం. అయితే Quad Group లో ఉండడం వలన అమెరికా కానీ,జపాన్ కానీ న్యూక్లెయర్ జలాంతర్గామి tech ని మనతో పంచుకుంటాయి ఇది + పాయింట్ అవుతుంది.
హిందూ మహా సముద్ర ప్రాంతం మీద చైనాకి ఎప్పటినుండో ఆసక్తి ఉంది. ఏదో ఒక రోజు ఏ దుస్సాహసానికి పూనుకోవచ్చు. మనకి Quad Group వల్ల పూర్తి రక్షణ ఉంటుంది.
ఇప్పటికే చైనా తమ దేశంలో ఏర్పడ్డ ఆహార సమస్యని పూడ్చుకోవడానికి పాకిస్తాన్ లో ఉన్న EEZ [Exclusive Economic Zone] ని తన అధీనంలోకి తీసుకొని అక్కడ పంటలు పండించడం మొదలుపెట్టేసింది.
తమ అవసరాలు తీరాక మిగిలినవాటిని ఇతర దేశాలకి అమ్మడానికి హిందూ మహాసముద్రం,అరేబియా సముద్రాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మన అనుమతి లేకుండా మన జలాల్లో తమ వాణిజ్య నౌకాలని నడపడానికి ప్రయత్నిస్తే అది ఘర్షణకి దారితీస్తుంది ఎప్పటికయినా.
దీనికి ఇప్పటినుండే చెక్ పెట్టాలి అంటే మనకి Quad Group లోని దేశాల నేవీ అవసరం ఉంటుంది.అలాగే హిందూ మహా సముద్రంలోని ఫిల్లిప్పో దీవుల విషయంలో చైనా కన్ను ఉంది ఇది మరో సౌత్ చైనా వివాదం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మనం Quad Group కి ఉండడం మంచిది.
Quad Group : Multiple fronts: Co-ordination: ఈ గ్రూపులో ఉన్న దేశాల వివాదాలు :

1. జపాన్ చైనా ల మధ్య తూర్పు చైనా సముద్ర వివాదం [East China Sea],
2. భారత్ : LAC దగ్గర చైనా ,పాకిస్తాన్ లతో వివాదం.
3. అమెరికా : ఫిల్లిప్పైన్స్ దగ్గర చైనా తో వివాదం మరియు సౌత్ చైనా సముద్ర వివాదం.
4. ఆస్ట్రేలియా : డిగోగార్షియా దీవుల దగ్గర చైనా తో వివాదం.

వుమ్మడి శత్రువు స్నేహితుడే కదా? క్వాడ్ గ్రూప్ వల్ల చైనా ఒకేసారి నాలుగు శక్తివంతమయిన దేశాలతో ఒకే సారి తలపడాల్సి ఉంటుంది దీనివలన చైనా చాలా నష్టపోతుంది. ఎలా చూసినా ఇది చైనా దూకుడు కి చెక్ పెట్టె ప్రతిపాదన.
Cons : ప్రతికూలతలు : ఎప్పుడయినా అమెరికా అడిగితే ఆఫ్ఘనిస్తాన్ లో మన సైన్యాన్ని దింపాల్సి ఉంటుంది ఇది మనకి ఇష్టం లేని పని కానీ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా ఘర్షణ వస్తే అటు సౌత్ చైనా సముద్రానికి , ఇంకో వైపు పసిఫిక్ సముద్రానికి [japan ] మన నేవీని పంపాల్సి ఉంటుంది
అఫ్కోర్స్ మనం ఒంటరిగా ఉండము తోడుగా మిగతా మూడు దేశాల నేవీ కూడా ఉంటుంది. ఇది మన శాంతి సిద్ధాంతానికి వ్యతిరేకం కానీ తప్పదు.
కిం కర్తవ్యం ? శాంతి శాంతి అంటూ ఇప్పటికే చాలా నష్టపోయాము కాబట్టి ఖచ్చితంగా క్వాడ్ గ్రూప్ లో చేరాలి పైగా మనం ఎవరినీ అడుక్కోవట్లేదు వాళ్ళంత వాళ్ళే మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మిగతా సభ్య దేశాలని చాలా తేలికగా ఒప్పించవచ్చు
తద్వారా POK ని స్వాధీనం చేసుకోవడం చాలా సులభం అవుతుంది పైగా మిగతా సభ్య దేశాలు మనకి సహకరిస్తాయి. ఇదే సూత్రం చైనా అధీనంలో ఉన్న ఆక్సాయి చిన్, టిబెట్ లకి కూడా వర్తిస్తుంది. అమెరికా ఇప్పటికే టిబెట్ విషయంలో మనకి సపోర్ట్ గా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండబోదు.
Quad Group కోసమే అనుకుంటా అమెరికా జెర్మనీ లో ఉన్న తమ సైన్యాన్ని తిరిగి రప్పిస్తున్నట్లు ప్రకటించింది రెండు నెలల క్రితమే అలాగే నాటో దేశాల రక్షణ బాధ్యత ఇకపై అమెరికా తీసుకోబోదు అంటూ కూడా హెచ్చరించాడు ట్రంఫ్ .
ఇప్పుడు అమెరికాకి అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం భారత్ ఎందుకంటే ఆసియాలో చైనా కి బదులు చెప్పగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే. అమెరికా తో ఉంటే యూరోపియన్ దేశాల నుండి మాటి మాటికి మానవ హక్కులు అంటూ సోది ఉండదు.
ముఖ్యముగా చైనా ప్రపంచ శత్రువు అయ్యింది; 137 దేశాలు మహమ్మారిపై దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సభలో ఒక తీర్మానాన్ని చేశాయి.
న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియన్ మాజీ అధ్యక్షుడు ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్ నేతృత్వంలోని స్వతంత్ర ప్యానెల్ నవంబర్లో మధ్యంతర నివేదికను ఇవ్వనుంది.
చైనా ఉద్దేశపూర్వకంగానే చేసింది, దాని ద్వారా ప్రాంపంచములో చాల దేశాలు కస్త పడుతున్నాయి అనేది [ప్రపంచ దేశాల లో 95% మంది అభిప్రాయము; చైనా తో సంభంధాల పయి చాల దేశాలు వెనక్కి పోతున్నాయి.
ఇది భారత్ కి మంచి అవకాశము; గ్లోబల్ స్థాయిలో ఎదగటం, మన ఒక్క ఉద్దేశ్యాలు, ప్రయోజనాలకు ప్రాంపంచ దేశాల మద్దతు తీసుకోవటం; ఇద్దరికీ ఉపయోగమే; సరి అయిన నిర్ణయము భారత్ తీసుకుంటుంది అని ఆశిద్దాము.

జైహింద్ !
పార్ధసారధి పోట్లూరి thread నుండి https://www.facebook.com/permalink.php?story_fbid=805726090236928&id=100023986336008
You can follow @SaradhiTweets.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.