''పేదరికంలో మగ్గుతూ,ఉపాధి లేక రోగాలతో మూలుగుతున్న 80 శాతం ప్రజలకు వాక్‌ స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చి ప్రయోజనమేమిటి?'' అంటారు. సర్వోన్నత న్యాయస్థాన పూర్వ న్యాయమూర్తి మార్కండేయ కట్జు. నిజమే కదా...! పేదల జీవితమంతా కూటి కోసమే ఖర్చవు తుంటే ఇతరత్రా అనుభవించే సమయమేది?
నాగరికులుగా బతికే అవకాశమేది...!?
కూడు, గుడ్డ, గూడు వంటి ప్రాథమికావసరాలు కూడా తీరని స్థితి పేదరికం. ఆర్థిక, సామాజిక, కులమతాలుగా పేదరికం మూడు విధాలు. భారత్‌లో 50 శాతం ఆర్థిక పేదలు. 24.4 శాతంగా ఉన్న దళితులు సామాజిక పేదలు. 14 శాతంగా ఉన్న ముస్లిములు ఆర్థిక, సామాజిక, మత పేదలు
దేశ సంపదలో 58.4% ఒక్క% సంపన్నులది కేవలం 1% సంపదకు క్రింది స్థాయి 80% జనాభా ''అధిపతులు''. పేదరికానికి పెద్దల కొలబద్దలు - టెండూల్కర్‌ లెక్కలో పట్టణాలలో రూ.33, గ్రామాలలో రూ.27 రోజుకు ఖర్చు పెట్టేవారు పేదలు కారు రాజన్‌ ప్రకారం ఇవి రూ.47, రూ.32. ప్రపంచబ్యాంకు లెక్క 1.90 $ (రూ.124).
మనిషి రోజూ తినే తిండిలో అందే శక్తిని బట్టి పేదరికాన్ని నిర్ణయించాలని ఆర్థిక శాస్త్రవేత్తలన్నారు. ఇది పట్టణాలలో 2100, గ్రామాలలో 2400 క్యాలరీలు. బళ్ళలో మధ్యాహ్న భోజనానికి పిల్లల ఆధార్‌ కార్డు తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వం ఒక విద్యార్థికి రూ.5 పరిమితినీ విధించింది.
సామాజికార్థిక మనస్తత్వశాస్త్రంలో పక్కవానిని ద్వేషించే గుణం ఆధిపత్యం వహిస్తుంది. ఒక్క శాతం పీడక సంపన్ను లను 99 శాతం పీడితులు ఎలా పరిగణిస్తారు? ఇందిరా గాంధీ సోషలిజం కార్డుతో 1969లో అర్ధరాత్రి ఆర్డినెన్స్‌తో బ్యాంకుల జాతీయం, రాజభరణాల రద్దు చేశారు.
లక్షల కోట్ల పారు బాకీలు, పెద్దమనుషుల బ్యాంకుల పంగనామాలు చూస్తే బ్యాంకుల జాతీయం పేదల కంటే పెద్దలకే ఎక్కువ ఉపయోగపడినట్లు అర్థమవుతుంది. రాజభరణాల రద్దులో అసూయ అంశం పనిచేసింది. లోక్‌సభలో 1967లో 54.84% ఓట్లతో 283 సీట్లున్న ఇందిరమ్మను 1971 లో 79.82% ఓట్లతో 352 సీట్లకు పెంచారు పేదలు.
పేదరికం తన స్థానంలో స్థిరంగా ఉంది. మోడీ నోట్ల రద్దులో కూడా పెద్దలు ''పెద్ద'' ఇబ్బందులు పడతారూ, అవినీతి అంతమౌతుందన్న ఆశతో తమ కష్టాలు లెక్కజేయకుండా పేదలు మోదీయాన్ని ఆమోదించారు. తాము ఆర్థికంగా ఎదగాలన్న ఆకాంక్ష పేదల మానవ సహజ మనస్తత్వ లక్షణం, లక్ష్యం.
కమ్యూనిస్టులు పేదలకు ఇళ్ళ స్థలాలడిగితే నేను ఇళ్ళే ఇచ్చానన్న రాజశేఖర రెడ్డి వ్యాఖ్య గమనార్హం.నేటి TS చంద్రుడు నాటి AP చంద్రుడు ఇదే బాటలో పయనించారు, పయనిస్తున్నారు. వీరి మాయమాటలను నమ్మి పేదలు ఓట్లేశారు. ఆచరణలో వీళ్ళ పథకాలు అస్మదీయులకు అక్షయపాత్రలుగా, కామ ధేనువు లుగా మారాయి.
పేదల స్థాయిలో మార్పేమీ లేదు. కలలు పండించే పాలక పార్టీలలో వ్యాపారులైన పాత పాల కుల ప్రవేశం ధనార్జనకే కాని పేదరిక నిర్మూలనకు కాదు.

గ్రామీణ ప్రాంతాలలో ఉపాధులు కోల్పోయిన శ్రమజీవులు బతకడానికి పట్టణాలకొచ్చారు.
దొరికిన పనుల్లో దూరారు. పిల్లలను ఇక్కడ చదివించుకోలేరు. వాళ్ళు ఆవారాలయ్యారు. చిల్లరకొట్లలో, పెట్రోల్‌ పంపుల్లో, ధాబాలలో, బార్లలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో ''పనికి'' కుదిరారు. అక్కడి సమాజంలో వీళ్ళకు కనిపించిందేమిటి? పెద్దలు తమ పెంపుడు కుక్కలను కూడా విలాసంగా పెంచుతారు.
పెద్దలు, వారి భార్యాపిల్లలు ఏ పనీ చేయరు. అయినా తాగుతారు. తిరుగుతారు. ఆడుతారు. ఎగురుతారు. విలాసాలలో మునిగితేలుతారు. సిగ్గూ, భయం, సంకోచాలేమీ ఉండవు. వారికి రాజకీయ అండ, గుట్టలు గుట్టలుగా వారసత్వ అశ్రమ సంపద ఉన్నాయి.
ఇక ఓకే గది ఇరుకు ఇళ్ళలోనూ సక్రమ, అక్రమ రహస్య క్రీడలు విధిలేక బహిర్గతమై ఆవారాల కళ్ళలో పడతాయి. వీళ్ళు ఉద్రేకాలకు, ప్రలోభాలకు గురై దొంగతనాలకు, వ్యభిచారాలకు, అత్యా చారాలకు పాల్పడుతున్నారు. విద్య, వైద్యం, దురలవాట్లలో కూడా పేదల ఖర్చు పెరిగింది
దీనికి ప్రభుత్వాలదే బాధ్యత. విద్య, వైద్యాలను ప్రయివేటు యాజమాన్యాలకు అప్ప జెప్పారు. అశాస్త్రీయతను పెంచారు. పేదరికం పూర్వజన్మ కర్మ ఫలితమన్న భావనలో ముంచారు. ఆధ్యాత్మిక, భావవాదాలను ప్రభుత్వాలే ప్రచారం చేస్తున్నాయి.
పుణ్యకార్యాలు, పుష్కరాలు నిర్వహించి పుణ్యం, పురుషార్థం సంపాదించు కుంటున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ కార్యాలకు పూర్తి వత్తాసు పలుకుతోంది.

పేదల సుప్తచేతనావస్థలోని ఆకాంక్షలు పేదరిక నిర్వచనాన్ని మార్చివేశాయి.
ఇప్పటి దాకా స్థాయిని బట్టి పేదరికాన్ని తీవ్ర, సంపూర్ణ, సాపేక్ష పేదరికాలుగా చెప్పుకునే వాళ్ళం. తీవ్ర పేదరికంలో ప్రాణాలు నిలుపుకోవడమే కష్టం. సంపూర్ణ పేదరికం నిరాశ్రయ స్థితి. భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన వనరులుండవు.
ఇప్పుడు 'నాగరిక పేదరికం' అన్న కొత్త భావన, నిర్వచనం వచ్చాయి. దీని ప్రకారం పేదలు బురదలో పందుల్లా కాక, మాన మర్యాదలతో, ఆత్మగౌరవంతో నాగరిక పౌరులుగా బతకాల నుకుంటున్నారు. మూడు పూటలా తిండి, చలి, ఎండ, గాలి, వానల్లో చర్మాన్ని కాపాడే బట్టలు, సూర్యచంద్రులు, వరుణుడు కాపురముండని,
కుక్కలు, పిల్లులు దూరని ఇల్లు, టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, తమ పిల్లలకు ల్యాప్‌టాప్‌లు కావాలి. తమ పిల్లలూ కార్పొరేట్‌ విద్యాలయాల్లో చదవాలి. ఇంజనీర్లయి అమెరికా వెళ్ళాలి. డాలర్లు పంపాలి. తమకూ కార్పొరేట్‌ హాస్పిటళ్ళలో వైద్యం దొరకాలి. ఇవీ నాగరిక పేదరిక ఆకాంక్షలు
వీటితో పాలకులకు కొత్త తాళ్ళ పాలనాపగ్గాలు దొరికాయి. ప్రభుత్వ విద్యాలయాలను మూసి కార్పొరేట్‌ కళాశాలల్లో ఉపకార వేతనాలు, ఇంజనీరింగ్‌ కళాశాలలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలను అందిస్తున్నారు. ఇవన్నీ కొందరికే, కొంత తమ వారికే, నియమిత పరిమితులతోనే
అయినా ఇవి పాలకులకు విపరీత ప్రచారాన్ని, ప్రజా బంధువులు, పేదల పెన్నిధులు అన్న బిరుదులతో పాటు ఓట్ల ను, సీట్లను, కుర్చీలను అందించాయి. నిజానికి ఇవి ప్రజల సొమ్మును కార్పొరేట్లకందించాయి. ప్రజారోగ్యాన్ని, విద్యను సామాన్యులకు దూరం చేశాయి. ప్రజాసేవకు కొత్త అర్థాన్ని చ్చాయి.
విద్య, వైద్య, రవాణా రంగాల అక్రమ సంపాదకులు మంత్రులయ్యారు. తమ వాణిజ్య రక్షణకు కొందరు అధికార పార్టీలోకి దూకారు.

60 ఏండ్ల క్రితం మేము పేదలమని చెప్పుకోవడానికి పేదలు కూడా సిగ్గుపడేవారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలన్నా నామోషీగా భావించేవారు.
ఇప్పుడు సంక్షేమ పథకాలతో పేదల కంటే ఎక్కువ ధనవంతులే లాభపడు తున్నారు. అర్హత లేకున్నా పలుకుబడితో, లంచాలతో పథక ప్రయోజనం పొందుతున్నారు. ఇందుకు ''సహకరించే'' అధికారులు, రాజకీయ నాయకులు నల్లధన కుబేరులవుతున్నారు. ఉన్నత కులస్తులకు రిజర్వేషన్ల ఎన్నికల వాగ్దానాలను,
వాటి కోసం ప్రజా సంపదను నాశనం చేసే అర్థర హిత ''పోరాటాలను'' ఈ కోణం నుండే చూడాలి. ఇటీవల ఇండో నేషియాలో ఒక కొత్త ప్రయోగం జరిగింది. ప్రభుత్వ ప్రతి నిధులు ప్రజల వద్దకు వెళ్ళి పేదరిక సమాచారాన్ని నమోదు చేయడానికి బదులు ప్రజలనే మీ పేదరిక వివరాలతో నగదు బదిలీ పథకాలకు వినతి పత్రాలిమ్మన్నారు.
ధనికులెవరూ దరఖాస్తు చేయలేదు. పేదలు మాత్రమే ప్రయోజనాలడిగారు. మన 2011 జనాభా గణాంకాలలో ఒక గది ఇండ్లలో ఉన్న కుటుంబాల సంఖ్య ప్రభుత్వ ప్రతినిధుల ప్రకారం 6.6 కోట్లు, సామాజికార్థిక కుల గణనలో 2.57 కోట్లు.
(మరో మాయ) 2011 జనగణన ఖర్చు రూ.2,200 కోట్లని అంచనా. ఇందులో పనిచేసిన ఉద్యోగుల జీతభత్యాల పరిగణన లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 'జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌'కు కేటాయించిన సొమ్ము రూ.3,000 కోట్లు. పరిమిత సిబ్బందితో, నియమిత సమయం పాటు పౌరసమాచార సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.
వీటిలో ప్రజలు స్వచ్ఛందంగా తమ సమాచారాన్ని నమోదు చేయించవచ్చు. దీనితో ఖర్చు, కష్టనష్టాలు తగ్గుతాయి.ఆచరణ సాధ్యం కాని రీతిలో పేదరిక కొలబద్దలను తగ్గించి దారిద్య్ర రేఖను దింపి పేదరికం తగ్గిందని ప్రభు త్వాలు దండోరా వేసుకుంటున్నాయి.
పాలక మోసాలను,పేదల కాంక్షలను అర్థం చేసుకోవాలి.పేదరిక భావన సమంజసతను గుర్తించాలి.ప్రతి సామాజిక కులం,మతంలో అభ్యుదయవాదులున్నారు. వీరు తరగతి గది తెలివితేటల, సమావేశ మందిర సందేశాల ప్రయోజనాన్ని ప్రశ్నించాలి
తమ వర్గజనులకు నిజానిజాలను విశ్లేషించి వివరించాలి.పేదరిక నిర్మూలనకు పోరాడాలి
♥️🇮🇳♥️
You can follow @chandrasekarJSP.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.